News January 14, 2025
శ్రీకాకుళం: కొట్లాట ఘటనలో నలుగురిపై కేసు నమోదు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో సోమవారం జరిగిన కొట్లాట ఘటనలో ఇరువర్గాలకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన జీ.చిట్టిబాబు, ఎస్.విశ్వనాథం మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో వారు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ ఏ.విజయ్ కుమార్ తెలిపారు.
Similar News
News February 14, 2025
శ్రీకాకుళం: దామోదరం సంజీవయ్యకు ఘన నివాళులు

మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతి గడించారన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ వెంకటేశ్వరరావు, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.
News February 13, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మూడవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ డీన్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలను విద్యార్థులు జ్ఞానభూమి వెబ్సైట్లో తెలుసుకోవచ్చని సూచించారు. రీవాల్యుయేషన్‌కు రేపటి నుంచి విద్యార్థులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
News February 13, 2025
SKLM: గుండెపోటు.. రూ. 45 వేల ఇంజెక్షన్ ఉచితం

గుండెపోటు వచ్చే సమయాల్లో మొదటి గంట కీలకమని జిల్లా DCHS డాక్టర్ కళ్యాణ్ బాబు తెలిపారు. గోల్డెన్ అవర్‌లో రోగికి ఇచ్చే టెనెక్టివ్ ప్లస్ ఇంజెక్షన్ జిల్లాలో 15 చోట్ల అందుబాటులో ఉందన్నారు. రూ.45వేల విలువైన ఈ ఇంజెక్షన్ ఫ్రీగా అందించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రితో పాటు టెక్కలి, నరసన్నపేట, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, బారువ, మందస, కవిటి, హరిపురం, కోటబొమ్మాళి, పాతపట్నం, బుడితి, రణస్థలం, ఆమదాలవలసలలో ఉంది.