News March 19, 2024
శ్రీకాకుళం: కోడ్ నేపథ్యంలో లైసెన్సు తుపాకీలు స్వాధీనం

ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నందున లైసెన్స్ ఉన్న తుపాకులను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ సూచించారు. బ్యాంకు భద్రత సిబ్బంది, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సిబ్బంది వద్ద ఉన్న 75 మినహా మిగిలినవి అప్పగించాలన్నారు. జిల్లాలో 254 లైసెన్సులపై 273 తుపాకీలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఉన్న మిగతా తుపాకిలు అప్పగించాలన్నారు.
Similar News
News April 3, 2025
సరుబుజ్జిలి: నాలుగు నెలల్లో 4 ఉద్యోగాలు

సరుబుజ్జిలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన వాకముల్లు రమణమూర్తి కుమారుడు బాలమురళి B.TECH పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు. 2025 సంవత్సరంలో విడుదలైన రూరల్ బ్యాంక్(RRB) PO, క్లర్క్ ఫలితాల్లో ఉత్తీర్ణుడై చైతన్య గోదావరి బ్యాంక్లో పీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన IBPS క్లర్క్, RPF ఎస్ఐగానూ కూడా ఎంపికయ్యారు. 4 ఉద్యోగాలు సంపాదించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
News April 3, 2025
జలుమూరు: రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి

జలుమూరు మండలం కరవంజ పంచాయతీ తుంబయ్య పేట గ్రామానికి చెందిన రవికిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పలాసలో విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. గురువారం నందిగామ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల నరసన్నపేటలో జరిగిన డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లో ఎంపైర్గా సేవలు అందించారు. వైఎంసీఏ కార్యదర్శి గొద్దు చిట్టిబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
News April 3, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు శుభవార్త

శ్రీకాకుళం, పలాస మీదుగా హైదరాబాద్(HYD)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నం.07165 HYD- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.