News July 14, 2024
శ్రీకాకుళం: కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్‌లో మార్పులు
విజయవాడ డివిజన్‌లో ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఆగస్టు 2, 3, 5, 7, 9, 10వ తేదీలలో విజయవాడ-ఏలూరు మీదుగా కాక రాయనపాడు-గుడివాడ- భీమవరం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.
Similar News
News October 13, 2024
టెక్కలి: వారంలో కుమార్తె పెళ్లి.. యాక్సిడెంట్‌లో తండ్రి మృతి
టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామానికి చెందిన రుంకు మోహనరావు(55) అనే వ్యక్తి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈనెల 20వ తేదీన తన కుమార్తె హిమ వివాహం నేపథ్యంలో పెళ్లి పిలుపులకు సైకిల్‌పై వెళ్తుండగా టెక్కలి జాతీయ రహదారిపై విక్రంపురం గ్రామం సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
News October 13, 2024
శ్రీకాకుళం: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
SC, STఅభ్యర్థులకు డీఎస్సీ పరీక్ష కోసం మూడు నెలలు పాటు అర్హులైన మెరిట్ అభ్యర్థులకు రాష్ట్రంలో శిక్షణ పొందుటకు అవకాశం ఉందని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం http://jnanabhumi.ap.gov.in ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 11 నుంచి 21 వరకు మాత్రమే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News October 13, 2024
SKLM: మద్యం సీసా గుచ్చుకొని యువకుడి మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. మెళియాపుట్టి మండలం మురికింటిభద్ర గ్రామానికి చెందిన సవర సురేశ్(28) మద్యం తాగి బైకుపై వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడ్డాడు. అప్పటికే మద్యం బాటిళ్లను కడుపులో ఉంచుకొని డ్రైవ్ చేస్తుండటంతో.. అవి పగిలిపోయాయి. సీసా పగిలి కడుపులో గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడటంతో సురేశ్ మృతి చెందాడు. ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.