News February 11, 2025
శ్రీకాకుళం: క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం

రాష్ట్ర పీఈటి సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన సెమినార్, క్రీడా పోటీలలో శ్రీకాకుళం జిల్లా హ్యాండ్ బాల్ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు మంగళవారం జిల్లా కేంద్రంలో డీఈవో, తిరుమల చైతన్య, డిప్యూటీ డిఈవో విజయ కుమారి అభినందించారు. క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం రావడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News March 28, 2025
శ్రీకాకుళం: బాలల హక్కుల కార్యదర్శి నియామకం

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మురపాక గ్రామానికి చెందిన వమరవెల్లి మణి బాబును జిల్లా బాలహక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శిగా శుక్రవారం రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదర్ నియమించారు. ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడుతూ.. బాలల హక్కుల కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. బాల కార్మికులను గుర్తించడం, పాఠశాలల్లో డ్రాప్ ఔట్‌లను తగ్గించడం తన ప్రథమ కర్తవ్యం అని అన్నారు.
News March 28, 2025
SLM: పక్షుల రక్షణకు విద్యార్థుల వినూత్న ఆలోచన

పక్షుల రక్షణకు విద్యార్థులు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బూరగాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల, గ్రామాలలో పక్షుల కోసం ప్రత్యేకంగా తొట్టెలు, కొబ్బరి చిప్పల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎండకు స్పృహ తప్పి పడిపోయిన పక్షికి విద్యార్థులు నీరు తాగించి రక్షించారు. దీంతో పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
News March 28, 2025
శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్‌ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు ఏప్రిల్ సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరతాయని వివరించారు.