News July 16, 2024
శ్రీకాకుళం: గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఇంటర్వ్యూ లు

శ్రీకాకుళం జిల్లాలోని డా.బి.ఆర్ అంబేడ్కర్ గురుకులంలో గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమన్వయ అధికారి బాలాజీ నాయక్ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. కొల్లివలసలో జేఎల్ మ్యాథ్స్, కంచిలిలో జేఎల్ కెమిస్ట్రీ, ఎచ్చెర్లలో జేఎల్ జువాలజీ, పాతపట్నంలో టీజీటీ బయాలజీ, పీజీటి సోషల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 18న ఉదయం 10గంటలకు ఆదివారం పేట కార్యాలయంలో హాజరు కావాలని కోరారు.
Similar News
News December 20, 2025
SKLM: RTC డోర్ డెలివరీ పార్సిల్ ప్రారంభం

ఆర్టీసీ సంస్థలో పార్సిల్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ కార్గో పార్సిల్ కౌంటర్ వద్ద శనివారం ప్రారంభించారు. 50 కేజీల బరువున్న పార్సిల్ 10 కిలోమీటర్లు దూరం పరిధిలో ఉన్న స్థలాలకు సురక్షితంగా పంపించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 84 పట్టణాల్లో ఈ సేవలను ప్రారంభించాన్నారు.
News December 20, 2025
శ్రీకాకుళం: హాట్ హాట్గా జడ్పీ సర్వసభ్య సమావేశం

శ్రీకాకుళంలో జడ్పీ సర్వసభ్య సమావేశం హాట్ హాట్గా సాగుతోంది. ఉపాధి హామీ నిధుల వినియోగం, సచివాలయాలు, RBKల నిర్మాణాల పనుల బిల్లులు రాలేదని సభ్యులు ప్రశ్నించగా సంబంధిత అధికారులు బిల్లులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కలగజేసుకున్నారు. అయితే కేవలం వైసీపీనే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ సభ్యులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పరస్పర ఆరోపణలతో సభ హీట్ ఎక్కింది.
News December 20, 2025
వజ్రపుకొత్తూరు: బీచ్లో వెనక్కి వెళ్లిన సముద్రం

వజ్రపుకొత్తూరు మండలంలోని శివ సాగర్ బీచ్లో సముద్రం వెనక్కి వెళ్లింది. ఒక్కసారిగా 50 మీటర్ల మేర వెనకకు వెళ్లడంతో పర్యాటకులు ఈ వింతను చూసేందుకు తరలివచ్చారు. దీనికి తోడు ఎంతో తక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించారు. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.


