News March 16, 2025
శ్రీకాకుళం: గ్రీవెన్స్ సెల్ సమయం మార్పు

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ సమయాన్ని మార్చారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకే గ్రీవెన్స్ సెల్ ప్రారంభమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
Similar News
News November 15, 2025
ఎచ్చెర్ల: ‘వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం’

వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ మేరీ క్యాథరిన్ అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మహిళా గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థినులకు వ్యక్తిగత పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రక్తహీనత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసర ప్రాంతాల పరిశుభ్రంగా ఉండాలన్నారు.
News November 15, 2025
కోటబొమ్మాళి: భర్తకు అంత్యక్రియలు జరిపిన భార్య

కోటబొమ్మాళి మండలం జర్జంగి పంచాయతీలో గల గుంజులోవ గ్రామంలో విషాద ఘటన కలిచివేసింది. గ్రామానికి చెందిన తిర్లంగి లక్ష్మణరావు(40) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆయనకు పదేళ్లు కూడా నిండని ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో భార్య తీర్లంగి రోహిణి భర్తకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ విషాద దృశ్యం అక్కడి వారి కంట కన్నీరు తెప్పించింది.
News November 14, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➤జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
➤ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు
➤ కొత్తమ్మతల్లి ఆలయంలో మహా మృత్యుంజయ యాగం
➤టెక్కలిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
➤SKLM: గ్రంథాలయాలు పాఠకులకు నేస్తాలు
➤మందసలో రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు
➤నరసన్నపేట: నో స్మోకింగ్ జోన్లుగా పాఠశాల ప్రాంగణాలు


