News March 16, 2025
శ్రీకాకుళం: గ్రీవెన్స్ సెల్ సమయం మార్పు

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ సమయాన్ని మార్చారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకే గ్రీవెన్స్ సెల్ ప్రారంభమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
Similar News
News July 5, 2025
రణస్థలం: ఏడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ విశాఖలోని రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను శుక్రవారం తన గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.
News July 5, 2025
SKLM: ‘SC ఇంటర్ విద్యార్థులకు అకౌంట్లోకి తల్లికి వందనం’

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థులకు నేరుగా అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు జమ అవుతాయని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 -26 విద్యా సంవత్సరంలో కాలేజీలో జాయిన్ అయి, వారి బ్యాంక్ అకౌంటుకు NPCI లింకు చేయాలని పేర్కొన్నారు. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో వ్యక్తిగత ఖాతా ఓపెన్ చేయాలని తెలిపారు.
News July 5, 2025
శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు శుభవార్త

శ్రీకాకుళం రోడ్ పలాస మీదుగా SMVT బెంగుళూరు(SMVB)- నారంగి(NNGE) మధ్య నడుస్తున్న 2 ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు నడిచేలా పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06559 SMVB- NNGE రైలు జులై 8, 15 తేదీలలో, నం.06560 NNGE- SMVB మధ్య నడిచే రైలు జులై 12, 19 తేదీలలో ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.