News December 24, 2024
శ్రీకాకుళం ఘోర ప్రమాదంలో మృతులు వీరే!
కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు <<14965595>>మృతి<<>> చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్నం సీతమ్మధార నుంచి ఒడిశాలోని జాజ్పూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన జరిగింది. ఓవర్ స్పీడ్తో వెళ్తున్న కారు కరెంట్ పోల్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో విశాఖలోని సీతమ్మధారకు చెందిన కదిరిశెట్టి సోమేశ్వరరావు(48), ఎం.లావణ్య(43), స్నేహగుప్తా(18) మరణించారు.
Similar News
News December 26, 2024
మందస: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా మందస మండలం పితాతొలి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పలాస నుంచి మందసకు వెళ్తుండగా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో సొండిపూడి లైన్ మేన్ జోగారావుతో పాటు మరో యువకుడు కిరణ్కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు.
News December 26, 2024
సిక్కోలుకు భారీ వర్షసూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విశాఖ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఓడ రేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీచేశారు.
News December 26, 2024
శ్రీకాకుళం: క్రీడాకారులకు ఎమ్మెల్యే అభినందన
పీఠాపురంలో ఈ నెల 18,19,20 తేదీల్లో సీనియర్ మెన్ బాక్సింగ్ టోర్నమెంట్ జరిగింది. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్ జ్ఞానేశ్వర్రావు, పి.అప్పలరాజు, హేమంత్ కుమార్లు గోల్డ్ మెడల్ పొందారు. వీరితో పాటు పి.విశ్వేశ్వరరావు, ఎం.లోకేష్, ఎస్.ఏసు, కె. శ్రీకాంత్, డి.మనోజ్ కుమార్లు సిల్వర్ మెడల్ సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్-2ని కైవసం చేసుకున్నారు. వీరిని బుధవారం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందించారు.