News September 16, 2024
శ్రీకాకుళం: చనిపోయినా కష్టాలే..!
శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చోట్ల చనిపోయిన తర్వాత కూడా కొందరికీ కష్టాలు తప్పడం లేదు. జలుమూరు మండలం తలతరియా పంచాయతీ లింగాలపాడులో సోమవారం వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. స్థానిక గ్రామంలోని దళితుల శ్మశానానికి సరైన దారి లేదు. ఈక్రమంలో నడుము లోతు నీటిలో చిన్న గట్టు వెంబడి మృతదేహాన్ని ఇలా తరలించారు. పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ రహదారి సౌకర్యం కల్పించలేదని గ్రామస్థులు వాపోతున్నారు.
Similar News
News October 6, 2024
SKLM: పారదర్శకంగా ఇసుక సరఫరా: కలెక్టర్
ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి పలువురు అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, ప్రస్తుతానికి 6000 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సరఫరా చేస్తున్నామని వివరించారు.
News October 6, 2024
శ్రీకాకుళం: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ
శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినా, అక్రమంగా ఇసుకను రవాణా చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. వీరికి భారీగా జరిమానా విధించడంతోపాటు, కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. ఇప్పటి వరకు అక్రమార్కులపై రూ.5.75 లక్షలు జరిమానా కూడా విధించామని, పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో జిల్లా స్థాయి టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News October 6, 2024
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో విన్నర్‌గా సిక్కోలు విజయం
విజయవాడలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో భాగంగా శ్రీకాకుళం జిల్లా జట్టు పాల్గొంది. ఈ క్రమంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలో జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచిందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబురావు, బమ్మిడి శ్రీరామ మూర్తి ఆదివారం తెలిపారు. నేడు కూడా పలు పోటీలు కొనసాగుతున్నాయని దీనిలో భాగంగా జిల్లా క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు వచ్చిందన్నారు.