News March 25, 2024
శ్రీకాకుళం: జాతీయ రహదారిపై వ్యాన్ బోల్తా
పలాస మండలం శాసనాం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ఐచర్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నకు గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ.. వాహనాన్ని క్రేన్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Similar News
News September 8, 2024
శ్రీకాకుళంలో రేపు విద్యా సంస్థలకు సెలవు
శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కళాశాలకు, అన్ని విద్యా సంస్థలకు సోమవారం కలెక్టర్ దినకర్ సెలవు ప్రకటించారు. వర్షాలు సోమవారం కూడా కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదేశాలను ఎవరూ పాటించక పోయిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News September 8, 2024
శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రానున్న 2 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మత్స్యకారులు 3 రోజులు వేటకు వెళ్లొద్దని, నదీ పరిహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557కు ఫోన్ చేయాలని, అలాగే ఈ-మెయిల్ ఐడీ cosklmsupdtd@gmail.com ద్వారా ఫొటోలను పంపించాలని తెలిపారు.
News September 7, 2024