News September 3, 2024
శ్రీకాకుళం: జాబ్ మేళాలో 63 మంది ఎంపిక
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లో జరిగిన జాబ్ మేళాలో 63 మంది వివిధ కంపెనీలలో ఎంపిక అయ్యారని ప్రిన్సిపల్ కె సూర్యచంద్రరావు తెలిపారు. మంగళవారం స్థానిక కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో భాగంగా 167 మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు. విద్యార్థినులు కూడా ఉద్యోగమేళాలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. విద్యార్థినులు 65 మంది పాల్గొనగా 32 మంది ఎంపిక అయ్యారని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News September 11, 2024
శ్రీకాకుళం: ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీలో స్పాట్ అడ్మిషన్లు
శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాలలో ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీలో మిగిలి సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం.ప్రదీప్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జీవశాస్త్రం సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అన్నారు. వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.
News September 11, 2024
శ్రీకాకుళం: నేటి నుంచి ఉచిత ఇసుక నూతన విధానం
శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఉచిత ఇసుక నూతన విధానం అమలులోకి రానుంది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఇసుకకు సంబంధించి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18005994599 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇసుక నిర్వహణకు సంబంధించిన అంశాలపై సంబంధిత సిబ్బందికి శిక్షణ అందించనున్నట్లు గన్ను శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.
News September 11, 2024
SKLM: రాష్ట్ర పండుగగా కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర
కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొత్తమ్మతల్లి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ జాతర నిర్వహణ కోసం రూ.కోటి మంజూరు చేసింది. ఈ నిధులను అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం నుంచి సమకూర్చనున్నట్లు పేర్కొంది.