News July 21, 2024

శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా ఫర్మాన్ అహ్మద్ ఖాన్

image

జిల్లా సంయుక్త కలెక్టర్(జేసీ)గా ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం అన్నమయ్య జిల్లా జేసీగా పని చేస్తున్నారు. ప్రస్తుత జేసీ ఎం.నవీన్‌ను సీఆర్డీఏ అదనపు కార్యదర్శిగా బదిలీ చేశారు. 2022 అక్టోబరు 12న నవీన్ జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించారు.

Similar News

News December 1, 2025

రైతులు అప్రమత్తంగా ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటలపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News December 1, 2025

శ్రీకాకుళం జిల్లా SP గ్రీవెన్స్‌కు 61 అర్జీలు.!

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను SP ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. కాగా నేడు మొత్తం 61 అర్జీలు స్వీకరించామన్నారు.