News August 20, 2024
శ్రీకాకుళం జిల్లాకు నూతన ఎస్‌ఐల నియామకం
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు బదిలీల ద్వారా పలువురు నూతన ఎస్‌ఐలను నియమిస్తూ విశాఖ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.చిరంజీవి(జెఆర్ పురం), జీ.లక్షణరావు(లావేరు), ఎం. ప్రవల్లిక(బూర్జ), వీ.సత్యనారాయణ(పొందూరు), సీహెచ్.దుర్గాప్రసాద్(నరసన్నపేట), బి.అశోక్ బాబు(జలుమూరు), బీ.అనిల్ కుమార్(సారవకోట), ఆర్.సంతోష్(శ్రీకాకుళం 2 టౌన్), బీ.లావణ్య(పాతపట్నం), లక్ష్మీ(శ్రీకాకుళం ఉమెన్) తదితరులను నియమించారు.
Similar News
News September 12, 2024
సోంపేట: అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. 20 మంది ప్రయాణీకులతో శ్రీకాకుళం నుంచి బయలుదేరిన బస్సు సోంపేట మండలం మామిడిపల్లి గ్రామం సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.
News September 12, 2024
తిరుపతి- శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు
తిరుపతి- శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. అక్టోబరు 6నుంచి నవంబర్ 10 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి ఆదివారం ఈ స్టేషన్ల మధ్య నడవనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, శ్రీకాకుళం- తిరుపతి మధ్య అక్టోబరు 7 నుంచి నవంబర్ 11 వరకు ఈ ప్రత్యేక రైలు.. ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని వివరించారు.
News September 11, 2024
SKLM: నది కాలువలో ఒకరు మృతి
నీట మునిగి ఒకరు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామ సమీపంలోని వంశధార కుడి కాలువలో స్నానం చేయడానికి గుండ చంద్రుడు(44) బుధవారం వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఎస్ఐ వెంకటేశ్ మృతదేహాన్ని పరిశీలించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.