News September 20, 2024
శ్రీకాకుళం జిల్లాకు నేడు వర్ష సూచన

శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడా శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న విజయనగరం, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడా వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News October 14, 2025
ఎచ్చెర్ల: క్యాంటీన్ నిర్వహణకు వర్శిటీ దరఖాస్తుల ఆహ్వానం

ఎచ్చెర్ల అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఉన్న క్యాంటీన్ నిర్వహణకు ఆసక్తిగల వారి నుంచి సంబంధిత దరఖాస్తులను వర్శిటీ ఆహ్వానిస్తుందని రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి దీనికి సంబంధించిన వివరాలు, దరఖాస్తు ఫారమ్ వంటివి వర్శిటీ www.brau.edu.inలో అందుబాటులో ఉంటాయన్నారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా వర్శిటీ రిజిస్ట్రార్ కార్యాలయానికి అందజేయాలన్నారు.
News October 14, 2025
ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 42 శాతం ప్రవేశాలు’

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.
News October 14, 2025
రైల్వే స్టేషన్లో చిన్నారిని విడిచిన గుర్తుతెలియని వ్యక్తులు

ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ చిన్నారిని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై ఓ వ్యక్తికి పాపని చూడమని, టాయిలెట్‌కి వెళ్లి వస్తామని ఓ మహిళ అప్పగించి వెళ్లిపోయారు. తిరిగి ఆ వ్యక్తి రాకపోవడంతో GRP పోలీసుల సహకారంతో పలాస రైల్వే స్టేషన్లో చైల్డ్ హెల్ప్ డెస్క్‌కు చిన్నారిని అప్పగించారు.