News July 31, 2024

శ్రీకాకుళం జిల్లాకు రూ.250 కోట్లు!

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని 7 జిల్లాలకు రూ.1,750 కోట్లు కేటాయించింది. ఒక్కో జిల్లాకు రూ.250 కోట్లు రానున్నాయి. వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు కూడా రూ.250 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయనుంది. ఈ నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించనున్నారు.

Similar News

News January 24, 2026

జలమూరులో యాక్సిడెంట్ స్పాట్‌లో ఒకరు మృతి

image

జలుమూరు మండలం చల్లవానిపేట చెరువు మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 14 ఏళ్ల బాలుడు ఋషి ఈ ప్రమాదంలో మృతి చెందాడు. చోదకుడితో పాటు బైక్‌పై ఉన్న వారికి గాయాలవ్వడంతో స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 24, 2026

SKLM: నేటి సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు..!

image

రథసప్తమి వేడుకల్లో భాగంగా శనివారం నాటి వివరాలు ఇలా…
*సాయంత్రం 6.గం లకు తన్మయి శాస్త్రీయ నృత్యం, గణపతి శర్మ, యామిని కర్రిల మ్యూజికల్ షోలు,
రాత్రి 7:00 నుంచి థమన్ లైవ్ కాన్సర్ట్, ఢీ డాన్సర్స్ ఆక్సా ఖాన్, మణికంఠ, తేజస్వినిల ప్రదర్శనలు,* సినీ నటుడు ఆది ముఖ్య అతిథిగా హాజరుకాగా, ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, చంద్రికలు యాంకర్లుగా, డ్రోన్ షో కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

News January 24, 2026

ఆమదాలవలస మహిళకు జిల్లా బాధ్యతలు

image

వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఆమదాలవలసకు చెందిన అజంత కుమారిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. పార్టీ మహిళా విభాగం కమిటీ నియామకంలో భాగంగా అజంతా కుమారిని జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పించారు. తనకిచ్చిన గుర్తింపును బాధ్యతగా నిర్వహిస్తామని తెలిపారు.