News January 15, 2025

శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన సినీ నటుడు

image

శ్రీకాకుళం మండలంలో అరసవల్లి గ్రామంలో ఉండే శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి సినీ నటుడు సాయి కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. స్వామిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ యర్రంశెట్టి భద్రాజీ, శ్రీస్వామి వారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Similar News

News February 15, 2025

పలాస : రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

తిరుపతి – పూరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే 9440627567 నంబరుకు సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించామన్నారు.

News February 15, 2025

రణస్థలం : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న జేసీ

image

రణస్థలం మండలం పైడి భీమవరం ఇసుక తనిఖీ కేంద్రం వద్ద 28 లారీలను జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. అందులో 12 లారీలు నకిలీ బిల్లులతో రవాణా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆయా లారీలను సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు. అనంతరం వాటిని మైన్స్ అండ్ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీలో తహశీల్దార్ ఎన్ ప్రసాద్, ఎస్సై చిరంజీవి, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

News February 15, 2025

ఎచ్చెర్ల: నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం.. యువకుని మృతి

image

ఎచ్చెర్ల జాతీయ రహదారిపై కుశాలపురం బైపాస్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సవర నవీన్ (21) మృతి చెందారు. బైక్‌పై శ్రీకాకుళం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ వెనుక కూర్చున్న కళ్యాణి అనే యువతికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఎస్సై సందీప్ కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

error: Content is protected !!