News February 22, 2025
శ్రీకాకుళం: జిల్లాను ప్రగతి పథంలో తీసుకువెళ్లాలి

జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో 2వ, 4వ, 7వ స్థాయి సంఘాల సమావేశం జరిగింది. జిల్లా అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు హాజరయ్యారు.
Similar News
News March 22, 2025
సంతబొమ్మాళి యువకుడికి రూ.1.3 కోట్ల కొలువు

సంతబొమ్మాళి మండలం ఉద్దండపాలెంకు చెందిన హనుమంతు సింహాచలంకు పోలాండ్ దేశంలో రూ.1.3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది. విశాఖలో MHRM విద్య పూర్తిచేసిన యువకుడు పోలాండ్‌లో ఒక డైరీ సంస్థలో HR Assistant గా ఎంపికయ్యారు. ఈ మేరకు యువకుడిని గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. యువకుడు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు.
News March 22, 2025
ఎమ్మెల్సీ దువ్వాడకు డాక్టరేట్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడకు “DAYSPRING INTERNATIONAL UNIVERSITY” డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఈ మేరకు తాజాగా శుక్రవారం హైదరాబాద్ యూనివర్సిటీలో తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా శ్రీనివాస్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆయనను పలువురు అభినందించారు.
News March 22, 2025
ఎచ్చెర్ల : 65 ఏళ్ల వయసులో LLB పరీక్ష

బీకే కళావతి అనే మహిళ 65 ఏళ్ల వయస్సులో శ్రీకాకుళంలోని ప్రైవేట్ న్యాయ కళాశాలలో ఐదేళ్ల L.L.B చదువుతున్నారు. ప్రస్తుతం ఈమె ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరీక్ష కేంద్రంలో LLB మూడో సెమిస్టర్ పరీక్ష రాస్తున్నారు. ఈమెది తమిళనాడు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు మేరకు దేశంలో ఎక్కడైనా న్యాయ విద్య చదివే అవకాశం ఉంది.