News July 17, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు

image

సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మూలపేటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి. ఆశాఖ మంత్రిగా రామ్మోహన్ ఉండటంతో వేగంగా ఆచరణలోకి రావొచ్చనే చర్చలు ఊపందుకున్నాయి.

Similar News

News December 10, 2024

శ్రీకాకుళం: నిలిచిపోయిన పనులు ప్రారభించండి: విజయ

image

ఇచ్ఛాపురం నియోజకవర్గ సమస్యలపై శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ కలెక్టరుకు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను కలిసి లేఖను అందజేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో గత ప్రభుత్వ హయాంలో వివిధ వంతెనలను ప్రతిపాదించి సాంకేతిక అనుమతులు, పరిపాలన, ఆర్థిక అనుమతుల మంజూరు చేసి టెండర్లను కూడా పిలిచామని ఆ పనులను ప్రారంభించాలని అభ్యర్థించారు.

News December 9, 2024

నరసన్నపేట- ఇచ్ఛాపురం హైవేను 6 లైన్లకు విస్తరించాలి

image

రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగమయ్యేలా స్థానిక జిల్లా మీదుగా ఉన్న జాతీయ రహదారి -16ను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దీనికి అనుగుణంగా నరసన్నపేట – ఇచ్ఛాపురం మధ్య ఉన్న జాతీయ రహదారిని 6 లైన్లకు విస్తరించాలని హైవే అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఉన్నారు.

News December 9, 2024

SKLM: మంత్రి నాదెండ్లను కలిసిన జనసేన నేతలు

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను విజయనగరం జిల్లాలోని భోగాపురం రిసార్ట్‌లో సోమవారం శ్రీకాకుళం జనసేన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి పీసీనీ చంద్రమోహన్, జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనువాసరావు, తాళాబత్తుల పైడిరాజు, చిట్టి భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.