News May 20, 2024
శ్రీకాకుళం జిల్లాలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
నాటుసారా స్థావరాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక ఆదేశాలతో సోమవారం ఉదయం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్‌లు, ఎస్సైల ఆధ్వర్యంలో ‘కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. ఎవరూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయరాదని హెచ్చరించారు.
Similar News
News December 8, 2024
SKLM: రైల్వే అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై విశాఖపట్నంలో ఆదివారం డివిజన్ సమావేశం నిర్వహించారు. సమీక్షలో మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. అమృత భారత్‌లో భాగంగా శ్రీకాకుళం నౌపాడ స్టేషన్ల అభివృద్ధి చేయాలని, నౌపాడ -గుణుపూర్ లైన్ క్రాసింగ్ స్టేషన్ నిర్మాణం, టెక్కలి పాతపట్నం స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పొందూరు – పలాస మధ్య జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు.
News December 8, 2024
నందిగాం: కారు బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలు
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం సుభద్రపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అటుగా భారీ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
News December 8, 2024
శ్రీకాకుళం: కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన లారీ.. డ్రైవర్ మృతి
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యిరాళ్లకూడలి వద్ద చెన్నై-కలకత్తా హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి కొబ్బరికాయల లోడుతో వస్తున్న లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని దిండుగల్ చెందిన లారీ డ్రైవర్ షేక్ షబ్బీర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.