News August 8, 2024
శ్రీకాకుళం: జిల్లాలో జనసేన 61,982 సభ్యత్వాలు నమోదు

జిల్లాలో జనసేన సభ్యత్వాలు భారీగా నమోదుయ్యాయిని పార్టీ ప్రతినిధులు బుధవారం తెలిపారు. జూలై 18 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమై 5 వ తేది సోమవారం సాయంత్రం వరుకూ నిర్వహించారు. ఇచ్ఛాపురం -11,355 సభ్యత్వాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎచ్చెర్ల – 10,136, పలాస- 6,302, పాలకొండ-5,744, పాతపట్నం-5,404, రాజాం-5,259, ఆమదాలవలస-5,118, శ్రీకాకుళం-5,022, టెక్కలి-4,406, నరసన్నపేట- 3,236 సభ్యత్వాలు నమోదయ్యాయి.
Similar News
News November 9, 2025
శ్రీకాకుళం: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

ఏటా కార్తీక మాసం 3వ సోమవారం సెలవు ఇస్తారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(DTF) శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసన్న, కృష్ణారావు చెప్పారు. కానీ రేపటి నుంచి జిల్లాలో అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు స్థానిక సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారిద్దరూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
News November 8, 2025
మాజీ మంత్రి అప్పలరాజుకు నోటీసులు?

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రభుత్వంపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు రావాలని కోరుతూ సీదిరి ఇంటికి శనివారం వెళ్లి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం.
News November 8, 2025
టెక్కలి: యాక్సిడెంట్లో ఒకరు స్పాట్ డెడ్

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.


