News July 12, 2024
శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✦ మూలపేట పోర్టు నిర్వాసితుల ఆందోళన ✦ ఆమదాలవలసలో ఇద్దరు బైక్ దొంగల అరెస్టు ✦ కారు ఆపి ఆమదాలవలస కార్యకర్తను పలకరించిన సీఎం ✦ జలుమూరులో బైక్‌ను ఢీకొన్న వ్యాన్ ✦ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పనులు అడ్డగింత ✦ మంత్రి అచ్చెన్నతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే భేటీ ✦ వసుంధర లేఅవుట్లను సందర్శించిన సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ ✦ పూండి రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
Similar News
News February 13, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మూడవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ డీన్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలను విద్యార్థులు జ్ఞానభూమి వెబ్సైట్లో తెలుసుకోవచ్చని సూచించారు. రీవాల్యుయేషన్‌కు రేపటి నుంచి విద్యార్థులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
News February 13, 2025
SKLM: గుండెపోటు.. రూ. 45 వేల ఇంజెక్షన్ ఉచితం

గుండెపోటు వచ్చే సమయాల్లో మొదటి గంట కీలకమని జిల్లా DCHS డాక్టర్ కళ్యాణ్ బాబు తెలిపారు. గోల్డెన్ అవర్‌లో రోగికి ఇచ్చే టెనెక్టివ్ ప్లస్ ఇంజెక్షన్ జిల్లాలో 15 చోట్ల అందుబాటులో ఉందన్నారు. రూ.45వేల విలువైన ఈ ఇంజెక్షన్ ఫ్రీగా అందించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రితో పాటు టెక్కలి, నరసన్నపేట, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, బారువ, మందస, కవిటి, హరిపురం, కోటబొమ్మాళి, పాతపట్నం, బుడితి, రణస్థలం, ఆమదాలవలసలలో ఉంది.
News February 13, 2025
శ్రీకాకుళంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు: రాజగోపాలరావు

నేటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.కె.రాజగోపాలరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధి లక్షణాలతో కోళ్లు మృతి చెందలేదని అన్నారు. జిల్లాలోని ప్రతి కోళ్ల ఫారంలు తనిఖీ చేయడానికి 68 రాపిడ్ యాక్షన్ టీమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. కోళ్ల పెంపకందారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.