News May 24, 2024
శ్రీకాకుళం జిల్లాలో పాలిటెక్నిక్ సీట్ల వివరాలు

శ్రీకాకుళం జిల్లాలో 5 ప్రభుత్వ , 5 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలో 780 సీట్లు, ప్రైవేట్ కళాశాలలో 1811 సీట్లు మొత్తం 10 కళాశాలలో 2,591 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 300 సీట్లు, శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్‌లో 120 సీట్లు, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్-120 సీట్లు, ఆమదాలవలస-120 సీట్లు, సీతంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 120 సీట్లు, ఉన్నాయి.
Similar News
News February 17, 2025
రహదారి ప్రమాదంపై అచ్చెన్న దిగ్భ్రాంతి

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుడంపాడు సమీపంలో ఆటో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
News February 17, 2025
ఇచ్ఛాపురం: శుభకార్యానికి వెళ్లొస్తూ వ్యక్తి మృతి

ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామానికి చెందిన రంగాల కృష్ణారెడ్డి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు వివరాల మేరకు.. ధర్మపురం గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్‌ను తప్పించబోయి బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.
News February 17, 2025
అక్కుపల్లి శివ సాగర్ బీచ్‌లో దొరికిన బ్యాగ్ అప్పగింత

వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివ సాగర్ బీచ్‌ను ఆదివారం భారీగా పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో మెలియాపుట్టి మండలం తంగణి గ్రామానికి చెందిన సవర త్రివేణి తన సర్టిఫికేట్స్‌లు ఉన్న బ్యాగ్ మార్చిపోయింది. ఈ విషయాన్ని అక్కుపల్లి శ్రీ రామాసేవా సంఘం వారు గుర్తించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అది చూసి బాధితురాలికి ఆ బ్యాగ్ అప్పగించారు. అక్కడ ప్రజలు శ్రీ రామా సేవాసంఘం సభ్యులను అభినందించారు.