News January 19, 2025
శ్రీకాకుళం జిల్లాలో పెరిగిన చలితీవ్రత

శ్రీకాకుళం జిల్లాలో చలితీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో పాటు మంచు అధికంగా కురుస్తుండడంతో చిన్న, పెద్ద తేడా లేకుండా చలికి వణుకుతున్నారు. జిల్లాలోని టెక్కలి, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు, గార మండలాల్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి, వేకువజాము సమయాల్లో చలిమంటలు వేస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News October 22, 2025
పొందూరు: ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’

తన దైనందిక జీవితంలో రోజు వారి పనులకు తల్లిదండ్రులపైనే ఈ దివ్యాంగుడు ఆధారపడాల్సిన పరిస్థితి. పొందూరు(M) తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్ కుమార్ 100 శాతం దివ్యాంగుడు. సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కుటుంబీకులు కోరుతున్నారు.
News October 22, 2025
శ్రీకాకుళం: ‘గుర్తు తెలియని వ్యక్తి మృతి’

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఈ నెల 19న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో 108 అక్కడికి చేరుకుంది. అనంతరం అతడిని శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీనిపై సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీసు స్టేషన్ సంప్రదించాలన్నారు.