News November 10, 2024

శ్రీకాకుళం జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డులు వీరే..!

image

లావేరు మండలం గోవిందపురం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుంటముక్కల శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే బూర్జ మండలంలోని ఓవీ పేట ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కావడం గమనార్హం.

Similar News

News December 11, 2024

మందస: తల్లిదండ్రులు మందలించారని సూసైడ్

image

క్షణికావేశంలో ఓ యువకుడు నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మందసకు చెందిన బెహరా రామకృష్ణ(33) సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించారు. అనంతరం గ్రామ సమీపంలో ఇటుకలు బట్టికి వెళ్లి పూరిపాకలో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. తండ్రి బెహరా శ్యామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

News December 11, 2024

శ్రీకాకుళం: ఓబీసీ ప్రక్రియను వేగవంతం చేయాలి

image

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర లోని తూర్పుకాపు, కళింగవైశ్య, శిష్ఠకరణ, సొండి, అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. దీనిపై గత 10 ఏళ్లుగా పార్లమెంటులో, ఎన్సీబీసీ కమిషన్‌లో పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. పలు కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో ఆయనతో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు.

News December 10, 2024

రణస్థలం: రెండు బైకులు ఢీ వ్యక్తి మృతి

image

రణస్థలంలోని పాత పెట్రోల్ బంకు సమీపంలో రెండు బైకులు ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు జె.ఆర్‌పురంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగి తలసముద్రపు పాటయ్య(67) బంకులో పెట్రోల్ కొట్టేందుకు బైక్‌పై సోమవారం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో లావేరు రోడ్డుకు వస్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో పాటయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.