News June 4, 2024

శ్రీకాకుళం జిల్లాలో భారీ ఆధిక్యంలో ఉన్నది వీరే..

image

శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. పలాసలో గౌతు శిరీష 32,087 ఓట్లు, టెక్కలిలో అచ్చెన్న 32,802 ఆధిక్యంలో ఉన్నారు. కాగా మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాద్ పలాస, శ్రీకాకుళం నియోజకవర్గాలలో ఓటమి బాటలో ఉన్నారు.

Similar News

News January 2, 2026

SKLM: న్యూ ఇయర్ కిక్..రూ. 3.75 కోట్ల మద్యం తాగేశారు

image

శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏడాది చివరి రోజు డిసెంబర్ 31న ఉదయం-రాత్రి వరకు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. ఈ అమ్మకాల ద్వారా రూ3.75 కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సీహెచ్ తిరుపతిరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 176 మద్యం షాపులు, 9 బార్లు ఉన్నాయని ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మకాలు జరిగాయాన్నారు.

News January 2, 2026

శ్రీకాకుళం: న్యూ ఇయర్ వేడుకలు.. 36 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

image

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి వరకు విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సోదాల్లో 36 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని, 15 మందిపై బహిరంగ మద్యం కేసులు నమోదు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాలు, నేర నియంత్రణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

News January 2, 2026

SKLM: జూన్ 2 నుంచి రీ సర్వే గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ

image

జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2 నుంచి రెవెన్యూ గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో మంత్రి అచ్చెన్న వీటిని పంపిణీ చేయనున్నారు. 652 గ్రామాల్లో 2,54,218 బుక్స్ పంపిణీకి సిద్ధం చేశామన్నారు.