News September 29, 2024
శ్రీకాకుళం జిల్లాలో భారీగా సీఐలు బదిలీ

విశాఖ రేంజ్లో 14 మంది సీఐలుకు శనివారం రాత్రి బదిలీలు జరిగాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు ఐదుగురు సీఐలు రానున్నారు. పాతపట్నం సీఐ నల్లి సాయిని విశాఖ వీఆర్కు బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జట్టి ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రేంజ్ లో ఉన్న సీఐలు..శ్రీనివాసరావు(డీసీఆర్బీ), కృష్ణారావు (టాస్క్ ఫోర్స్), సూర్యచంద్రమౌళి (సీసీఎస్), ఎం.కృష్ణమూర్తి (డీటీసీ), వానపల్లి రామారావు (పాతపట్నం) స్థానాలకు వస్తున్నారు.
Similar News
News December 6, 2025
సారవకోట: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సారవకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అలుదు గ్రామానికి చెందిన శంకర్రావు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని భార్యను నిత్యం వేధించేవాడు. శుక్రవారం రాత్రి కూడా డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ కుమార్ శనివారం కేసు నమోదు చేశారు.
News December 6, 2025
సారవకోట: మద్యం డబ్బుల కోసం గొడవ.. వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సారవకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అలుదు గ్రామానికి చెందిన శంకర్రావు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని భార్యను నిత్యం వేధించేవాడు. శుక్రవారం రాత్రి కూడా డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ కుమార్ శనివారం కేసు నమోదు చేశారు.
News December 6, 2025
SKLM: వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదు

రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణీ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ సర్వజనీన ఆసుపత్రిలో శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం సుమారుగా 7 నెలలు కావస్తున్నా వేతనాలు చెల్లించడం లేదన్నారు.