News June 7, 2024

శ్రీకాకుళం జిల్లాలో ముగిసిన ఎన్నికల కోడ్

image

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ గురువారంతో ముగిసింది. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాదాపు 50 రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో జిల్లా ఎస్పీ రాధిక, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆధ్వర్యంలో ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ముగియనున్న నేపథ్యంలో అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగనున్నాయి.

Similar News

News February 27, 2026

శ్రీకాకుళంలో అదుపులోకి వస్తున్న డయేరియా

image

శ్రీకాకుళం నగరంలోని ఐదు సచివాలయాల పరిధిలో ఈనెల 23న మొదలైన డయేరియా అదుపులోకి వస్తోంది. గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 102కు చేరగా, ప్రస్తుతం 67 మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

News February 27, 2026

శ్రీకాకుళం: డయేరియాపై కేంద్ర మంత్రి సీరియస్

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తాగునీరు, మురికి కాలువల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News February 27, 2026

SKLM: డయేరియా ప్రాంతంలో కఠిన నిబంధనలు

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ గురువారం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. మంగువారితోట దమ్మలవీధి కాకివీధి మేదరివీధి ప్రాంతాల్లో డయేరియా అదుపులోకి వచ్చినంత వరకు మాంసం విక్రయాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.