News January 7, 2025
శ్రీకాకుళం జిల్లాలో యువ ఓటర్లు 15,037 మంది నమోదు
శ్రీకాకుళం జిల్లాలో ఓటర్ల జాబితా సోమవారం సాయంత్రం జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వెంకటేశ్వరరావు విడుదల చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో 18 నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్న ఓటర్లు 15,037 మంది ఉన్నట్లు ప్రకటించారు. దీనిలో నరసన్నపేటలో 2,347 మంది, ఎచ్చెర్ల లో 2884, ఆమదాలవలసలో 2105, శ్రీకాకుళం 2,661, పాతపట్నం 1,952, టెక్కలి 2,606, పలాస 2,301, ఇచ్చాపురంలో 2,459 మంది యువ ఓటర్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 22, 2025
పలాస: పశువుల పాక కన్నా ఘోరంగా అంగన్వాడీ కేంద్రం
శ్రీకాకుళం జిల్లా పలాస మండల ఎంపీపీ గ్రామమైన మోదుగులపుట్టి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పశువుల పాక కన్నా అధ్వానంగా ఉంది. కనీసం తలుపులు (తడకలు) లేకుండా ఇరుకైన ప్రదేశంలో ఐదుగురు చిన్నారులు ఇక్కడ చదువుతున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో వీరితోపాటు ముగ్గురు గర్భిణీలు, ఇద్దరు బాలింతలు వస్తూ ఉంటారు. అదే ఇరుకైన గదిలో వంట సామగ్రితో పాటు నాడు-నేడు సామగ్రి కూడా అక్కడే భద్రపరిచారు.
News January 22, 2025
శ్రీకాకుళం: ఏంటి ఈ హెలికాప్టర్ టూరిజం..!
అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ హెలికాప్టర్ టూరిజం డచ్ బిల్డింగ్ దగ్గర హెలిపాడ్ వద్ద నిర్వహిస్తారు. అయితే ఇందులో ఆరుగురు మంది వరకు ట్రావెల్ చేయవచ్చు. దీనికి రూ.2వేలు వరకు ప్రతి ఒక్కరికి ఛార్జ్ ఉండే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు మూడు రోజులు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 22, 2025
రణస్థలం: బాలికపై యువకుడి అఘాయిత్యం
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన రణస్థలం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. జె.ఆర్ పురం ఎస్.ఐ చిరంజీవి తెలిపిన వివరాల మేరకు బాలిక వ్యవహార శైలిలో మార్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఎన్. ప్రసాద్ అనే యువకుడు బాలికను గ్రామ సమీపంలోని భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.