News January 1, 2025

శ్రీకాకుళం జిల్లాలో రూ.5.5 కోట్ల అమ్మకాలు

image

శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. జిల్లాలో ఒక్క రోజు సుమారు రూ.5.5 కోట్ల అమ్మకాలు చేపట్టినట్లు Excise అధికారులు బుధవారం తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా మందుబాబులు మద్యం కోట్లలో కొనుగోలు చేశారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రావడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగినట్లు పలువురు అంచనా వేస్తున్నారు.

Similar News

News January 25, 2025

SKLM: పురుగు మందు తాగి తల్లీ కూతురు మృతి

image

జలుమూరు మండలం శ్రీముఖలింగానికి చెందిన మహిళ మాధవి (25) తన ఇద్దరు కుమార్తెలతో పాటు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల వివరాల మేరకు.. విశాఖపట్నంలోని తగరపువలస ఆదర్శ నగర్‌లో నివాసముంటున్న రామకృష్ణ, మాధవి దంపతుల మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన మాధవి శనివారం కుమార్తెలకు పురుగుమందు తాగించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో మాధవి, చిన్న కుమార్తె రతిక్ష మృతి చెందారు.

News January 25, 2025

SKLM: కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డ్

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల అధికారిగా అవార్డు లభించింది. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో అత్యుత్తమ పని కనబరిచినందుకు ఈ అవార్డు అందుకున్నట్లు తెలిపారు.

News January 24, 2025

SKLM: పరీక్షా ఫలితాలు విడుదల

image

శ్రీకాకుళం పట్టణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో (స్వయం ప్రతిపత్తి) ఐదవ సెమిస్టర్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను అంబేడ్కర్ యూనివర్సిటీ డీన్ ఎస్. ఉదయభాస్కర్, ప్రిన్సిపల్ సూర్యచంద్ర ఆవిష్కరించారు. బీఏ 97.10% బీకాం జనరల్ 100%, బీకాం ఒకేషనల్‌లో 100%, బీఎస్సీలో 77.11% ఫలితాలు వచ్చాయన్నారు. అదే విధంగా కాలేజీ మొత్తం ఫలితాల శాతం 85.68% వచ్చేయని తెలిపారు.