News March 19, 2024
శ్రీకాకుళం జిల్లాలో రేపు పిడుగులతో భారీ వర్షాలు

ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, మంగళవారం రాజాం, పలాస, సీతంపేట, టెక్కలి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రేపు పిడుగులు పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Similar News
News February 27, 2025
శ్రీకాకుళంలో 23.93 శాతం పోలింగ్ నమోదు

శ్రీకాకుళంలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు 23.93 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న ఓటింగ్ తీరును పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
News February 27, 2025
ఎచ్చెర్ల : ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

విజయనగరంలో ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
News February 27, 2025
కవిటి యువకులు ఇద్దరు మృతి

కవిటి మండలం బెజ్జిపుట్టుగకు చెందిన రాజు, తొత్తిడిపుట్టుగకు చెందిన లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో విషాదం నెలకొంది. ఒడిశా వివాహానికి వెళ్లి వస్తూ మంగళవారం రాత్రి చీకటిపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బైకుకు నిప్పు అంటుకోవడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మరణించాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా రాజు మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన నరేంద్ర చికిత్స పొందుతున్నాడు.