News October 14, 2024

శ్రీకాకుళం జిల్లాలో 158 పేర్లు ఖరారు

image

శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదికలో ప్రారంభమైన మద్యం షాపులు కేటాయింపులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లాటరీ నిర్వహించారు. జిల్లాలో 158 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో 158 పేర్లు ఖరారు చేసినట్లు వారు పేర్కొన్నారు.

Similar News

News November 11, 2024

భోగాపురం ఎయిర్ పోర్టును 2026కి పూర్తి: కేంద్ర మంత్రి

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే భోగాపురం ఎయిర్ పోర్టు పనులను లక్ష్యం కంటే ముందుగానే 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెళ్లడించారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదివారం 6వ సారి ఆయన ఏర్పోర్టు పనులను పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

News November 10, 2024

శ్రీకాకుళం జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డులు వీరే..!

image

లావేరు మండలం గోవిందపురం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుంటముక్కల శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే బూర్జ మండలంలోని ఓవీ పేట ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కావడం గమనార్హం.

News November 10, 2024

శ్రీకాకుళం జిల్లా TODAY TOP NEWS

image

* శ్రీకాకుళం: కిసాన్ మేళాను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
* మెలకువలు పాటిస్తే కేసులను ఛేదించవచ్చు: SKLM SP
* శ్రీకాకుళం సుడా ఛైర్మన్‌గా రవికుమార్
* ఆమదాలవలస: 25ఏళ్లుగా ఇంట్లో పాము
* రాష్ట్రంలో నియంత పాలన: కృష్ణదాస్
* సోంపేట: పోస్ట్ ఆఫీస్‌లోనే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్
* ఇచ్చాపురం: వైసీపీ సీనియర్ నేత మృతి
* సీతంపేటలో అగ్ని ప్రమాదం.. ఇళ్లు దగ్ధం