News January 2, 2025
శ్రీకాకుళం జిల్లాలో 2,621 కేసుల బీర్లు తాగేశారు
శ్రీకాకుళం జిల్లాలో న్యూఇయర్ రోజున రూ.5.46 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కాగా మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 6,984 కేసులు ఐఎంఎల్(వైన్) విక్రయాలు జరిగాయి. 2621 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే విక్రయాలు పెరిగాయి. నాడు 5,597 కేసుల ఐఎంఎల్ మద్యం, 2,329 కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా రూ.5,12,21,367 ఆదాయం వచ్చింది.
Similar News
News January 8, 2025
కంచిలి: మద్యం మత్తులో భర్తను చంపిన భార్య
కంచిలి మండలానికి చెందిన అంకుల శణ్ముఖరావు(51) అనే వ్యక్తిని తన భార్య మంగళవారం వేకువజామున హత్యచేసింది. సుమారు ఆరు నెలలుగా దంపతులు ఇద్దరు రంగారెడ్డి జిల్లా ఆధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూలిపనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇరువురు మద్యం మత్తులో గొడవపడటంతో భర్తపై ఉమాపతి తీవ్రంగా దాడిచేయడంతో ఆయన మృతిచెందాడు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 8, 2025
టెక్కలి: టీడీపీ నేతలపై కేసు కొట్టివేత
టెక్కలి మండల టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావుతో పాటు 13 మందిపై 2022 ఫిబ్రవరిలో నమోదైన కేసు కొట్టివేస్తూ మంగళవారం టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి SHR తేజాచక్రవర్తి తీర్పు వెల్లడించారు. 2022లో టీడీపీ నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన క్రమంలో అప్పటి టెక్కలి మండల పరిషత్ అధికారి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేనందున కేసును కొట్టివేసినట్లు న్యాయవాది ప్రభుచంద్ తెలిపారు.
News January 8, 2025
SKLM: ఎస్సీ కులగణనపై 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.