News July 11, 2025

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

image

✯ మెళియాపుట్టి: విద్యుత్ షాక్ తో 5వ తరగతి విద్యార్థి మృతి
✯మందసలో అధికారులను అడ్డుకున్న రైతులు
✯ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రవికుమార్
✯ సారవకోట: లారీని ఢీకొన్న ఆటో.. ఐదుగురికి తీవ్ర గాయాలు
✯ కళింగపట్నంలో పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
✯ పలాస: గంజాయితో ముగ్గురు అరెస్ట్
✯ కంచిలి: అధ్వానంగా ఆసుపత్రి పరిసరాలు
✯ టెక్కలి: శాకాంబరీదేవిగా శివదుర్గ అమ్మవారు

Similar News

News August 31, 2025

తప్పుడు ప్రకటనలు మానుకోండి: ధర్మాన

image

ప్రజా సమస్యలను వదిలేసి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మబుగాం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రుషికొండ భవనాలపై చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు తీసి వారి కడుపు కొట్టొద్దని సూచించారు.

News August 31, 2025

SKLM: మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ

image

ఎస్సీ మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడి గడ్డెమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 20సంవత్సరాలు వయస్సు పైబడిన ఐదుగురు మహిళ అభ్యర్థులకు మాత్రమే హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ ట్రైనింగ్ ఉంటుందన్నారు. అర్హులైన ఎస్సీ మహిళలు జిల్లా షెడ్యుల్డ్ కులముల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News August 30, 2025

SKLM: క్యూ ఆర్ కోడ్ రేషన్ కార్డుల పంపిణీ ముమ్మరం

image

శ్రీకాకుళం జిల్లాలో 6,51,717 పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా క్యూ ఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభమైందని. ఈ పంపిణీ సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సంబంధిత కార్డుదారులు తమ రేషన్ షాప్ పరిధిలోని సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్ ద్వారా బయోమెట్రిక్ విధానంలో కార్డులు తీసుకోవాలని సూచించారు.