News May 20, 2024

శ్రీకాకుళం: జిల్లా నోడల్ అధికారిగా ఉమామహేశ్వరరావు

image

బక్రీద్‌ను పురస్కరించుకుని రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ నియమావళిని అమలు చేసేందుకు జిల్లా నోడల్‌ అధికారిగా ఏఎస్పీ (క్రైమ్‌) వి.ఉమామహేశ్వరరావును నియమించినట్లు ఎస్పీ జి.ఆర్‌ రాధిక సోమవారం తెలిపారు. జిల్లాలో జంతువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు చెక్‌పోస్టుల వద్ద నిరంతరం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో జంతువులను అక్రమంగా తరలించినా 63099 90803 కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News December 1, 2025

ధాన్యం రవాణాకు GPS వాహనం తప్పనిసరి: కలెక్టర్

image

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్‌ఎస్‌కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 1, 2025

ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి: శ్రీకాకుళం కలెక్టర్

image

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్‌ఎస్‌కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 1, 2025

శ్రీకాకుళం: డయేరియాపై మంత్రి అచ్చెన్న ఆరా.!

image

సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియాతో ఒకరు మృతి చెందడం, పలువురు వ్యాధి భారిన పడిన సంఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఆరా తీశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్య బృందాలను పంపించి వైద్య శిబిరం ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.