News May 20, 2024

శ్రీకాకుళం: జిల్లా నోడల్ అధికారిగా ఉమామహేశ్వరరావు

image

బక్రీద్‌ను పురస్కరించుకుని రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ నియమావళిని అమలు చేసేందుకు జిల్లా నోడల్‌ అధికారిగా ఏఎస్పీ (క్రైమ్‌) వి.ఉమామహేశ్వరరావును నియమించినట్లు ఎస్పీ జి.ఆర్‌ రాధిక సోమవారం తెలిపారు. జిల్లాలో జంతువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు చెక్‌పోస్టుల వద్ద నిరంతరం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో జంతువులను అక్రమంగా తరలించినా 63099 90803 కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News December 11, 2024

SKLM: రోడ్డు పనులు వేగవంతం చేయాలి- రామ్మోహన్

image

పలాస నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ రహదారులకు సంబంధించి నౌపడ నుంచి బెండిగేట్ రహదారిని రెండు వరుసల రహదారిగా చేయాలని కోరుతూ మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో వీరు మర్యాదపూర్వకంగా కలిశారు. నరసన్నపేట-ఇచ్ఛాపురం వరకు ఉన్న జాతీయ రహదారి 6 లైన్లకు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు.

News December 11, 2024

శ్రీకాకుళం జిల్లా పేరు మార్పుపై మీరేమంటారు..?

image

శ్రీకాకుళం జిల్లాకు సర్దార్ గౌతు లచ్చన పేరు పెట్టాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రజాకవి, ఫ్రీడం ఫైటర్ గరిమెళ్ల సత్యనారాయణ పేరు తెరపైకి వచ్చింది. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో సిక్కోలుకు గరిమెళ్ల పేరు పెట్టాలని అరసం జిల్లా అధ్యక్షుడు నల్లి ధర్మరావు కోరారు. మరి ఎవరి పేరు అయితే జిల్లాకు పెట్టాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.

News December 11, 2024

మందస: తల్లిదండ్రులు మందలించారని సూసైడ్

image

క్షణికావేశంలో ఓ యువకుడు నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మందసకు చెందిన బెహరా రామకృష్ణ(33) సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించారు. అనంతరం గ్రామ సమీపంలో ఇటుకలు బట్టికి వెళ్లి పూరిపాకలో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. తండ్రి బెహరా శ్యామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.