News March 15, 2025
శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం, పలాస మీదుగా షాలిమార్(SHM), విశాఖపట్నం(VSKP) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 16న VSKP- SHM(నం.08577), 17న SHM- VSKP(నం.08578) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు పలాస, శ్రీకాకుళం రోడ్తో పాటు విజయనగరం, కొత్తవలస, చీపురుపల్లితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News November 17, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➽జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి
➽మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పలాస ఎమ్మెల్యే శిరీష
➽ప్రధాన రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి: అచ్చెన్నాయుడు
➽శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్కు 53 వినతులు
➽ఆధ్యాత్మిక భావాలతో గ్రామాల్లో ఐకమత్యం: ఎమ్మెల్యే మామిడి
➽టీడీపీ శ్రేణులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: తిలక్
➽శ్రీకాకుళం: జిల్లాలో 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.