News April 11, 2025
శ్రీకాకుళం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

✮జలం-జీవంపై దృష్టి సారించాలి: కలెక్టర్
✮మెళియాపుట్టి: రోగులకు మెరుగైన సేవలందించాలి -ఐటీడీఏ పీఓ
✮శ్రీకాకుళం జిల్లాలో ఓటర్లు ఎంతమంది అంటే?
✮గ్రామ స్థాయిలో వైసీపీ బలోపేతమవ్వాలి: మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
✮టెక్కలి: బంగారం దుకాణాల్లో చోరీ.. దొంగ అరెస్ట్
✮సోంపేటలో ఈనెల 20న జాబ్ మేళా
✮ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే బగ్గు వినతుల స్వీకరణ
News April 17, 2026
శ్రీకాకుళం: 912 పంచాయతీల్లో ఓటర్లు ఎంతమందంటే?

స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. అన్ని పంచాయతీల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. జిల్లాలో 912 పంచాయతీలు ఉండగా, 16,22,067 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో, రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు జిల్లా పంచాయతీల్లో ఉన్నారు. గ్రామస్థాయిలో పారదర్శక ఓటర్ల జాబితా కూర్పుపై ఎన్నికల సంఘం కసరత్తు పెట్టింది.
News April 17, 2026
జనగణనపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

జనగణనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్, ముఖ్య జనగణన అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. స్వీయ-గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. దేశానికి స్వీయ గణన ఎంతో అవసరమన్నారు. మొబైల్ యాప్ (టెక్నాలజీ) వాడుకొనే జనగణనాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.


