News January 28, 2026
శ్రీకాకుళం: జిల్లా సమగ్ర అభివృద్ధికి వార్షిక బడ్జెట్ ఇదే

శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి గాను 2026-27 వార్షిక బడ్జెట్‌కు మంగళవారం జిల్లా పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జడ్పీ ఛైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో రూ.1,743.35 కోట్ల వార్షిక బడ్జెట్ నివేదికను జడ్పీ సీఈఓ సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, ప్రజల అవసరాలకు బడ్జెట్ తోడ్పడుతుందని విజయ అన్నారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.