News August 9, 2024
శ్రీకాకుళం: జిల్లా BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా BSNL 4జీ దశలవారీగా ప్రవేశ పెడుతున్నట్లు వినియోగదారులు 2జీ, 3జీ సిమ్ కార్డులను తక్షణమే 4జీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలని BSNL శ్రీకాకుళం జిల్లా జనరల్ మేనేజర్ నాయుడు మర్రి గురువారం తెలిపారు. జిల్లాలో 229 టవర్లకు ఇప్పటికే 50 టవర్లను 4జీ టవర్లుగా మార్పు చేశామని తెలిపారు. కస్టమర్లు కేవైసీని దగ్గర్లో ఉన్న BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో ఉచితంగా అప్‌గ్రేడ్ చూసుకోవచ్చున్నారు.
Similar News
News March 11, 2025
SKLM: పార్లమెంటులో అరకు కాఫీ ఘుమఘుమలు

ఏపీలో గిరిజన ప్రాంతాలలో పండించే అరకు వ్యాలీ కాఫీ ప్రత్యేకతను పార్లమెంటులో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకి లేఖ రాశారు. ఆ లేఖను మంగళవారం ఆయనకు అందజేశారు. సేంద్రీయ సాగైన అరకు కాఫీ గొప్ప రుచికి ప్రసిద్ధి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ‘మన్ కీ బాత్’ లో ఈ కాఫీ ప్రత్యేకతను ప్రశంసించారు.
News March 11, 2025
SKLM: జిల్లా అభివృద్ధి లక్ష్యాలను పూర్తి చేయాలి

ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో రెవెన్యూ, గ్రామ సచివాలయం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు వంటి అంశాలపై చర్చించారు.
News March 11, 2025
శ్రీకాకుళం: హోటళ్లు, లాడ్జీలకు గ్రీన్ లీఫ్ రేటింగ్

శ్రీకాకుళం జిల్లా ఉన్న హోటళ్లు, లాడ్జీలకు గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మంగళవారం సమన్వయ హోటళ్లు, లాడ్జీల యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. “ఈ వినూత్న వ్యవస్థ హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లలో పరిశుభ్రతను నిర్ధారించడం ద్వారా పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తుందని అన్నారు.