News December 6, 2024
శ్రీకాకుళం: జీజీహెచ్ పాఠశాలను విజిట్ చేసిన కలెక్టర్

శ్రీకాకుళం పట్టణ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను గురువారం సాయంత్రం కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఈనెల 7వ తేదీన జరగబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాట్లు కోసం సమీక్షించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలను అందించాలని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ విజయ కుమారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
Similar News
News November 10, 2025
యాక్సిడెంట్.. ఒకరి మృతి

నరసన్నపేట మండలం కోమార్తి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కారు మరమ్మతులకు గురికావడంతో పెద్దపాడు నుంచి మెకానిక్ కోరాడ వెంకటేశ్ వచ్చి మరమ్మతులు చేస్తున్నాడు. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ మృతిచెందగా కారులో ఉన్న సంతోశ్, సుశీల, శ్యాముల్ గాయపడ్డారు.
News November 10, 2025
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌లో 53 అర్జీల స్వీకరణ

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో 53 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ K.V.మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
News November 10, 2025
శ్రీకాకుళం: హోంగార్డుకు ఆర్థిక చేయూత

ఇటీవల రిటైర్ అయిన హోంగార్డు తిరుపతి రావుకు సహచర హోంగార్డులు ఒక్కరోజు గౌరవ వేతనం రూ. 4.11 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదగా నగదు చెక్కును ఆయనకు అందజేశారు. సహచర పోలీసు సిబ్బంది చూపిన ఈ సహకారం ప్రశంసనీయమని ఎస్పీ అన్నారు. పోలీసు కుటుంబం ఎప్పుడూ ఐకమత్యంగా ఉండాలని ఎస్పీ కోరారు.


