News July 24, 2024
శ్రీకాకుళం: జీడి పరిశ్రమలు బంద్
శ్రీకాకుళం జిల్లాలో పలాస-కాశీబుగ్గతో పాటు పలు చోట్ల పారిశ్రామిక వాడలోని జీడికర్మాగారాలు బంద్ అయ్యాయి. ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ జీడిపప్పు ఎగుమతి లేదని జీడి వ్యాపారులు సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలాస- కాశీబుగ్గతోపాటు పారిశ్రామిక వాడలోని సుమారు 200 కర్మాగారాల్లో బాయిలింగ్ పనులు నిలిపివేశారు. దీనివల్ల కార్మికులకు ఉపాధిలేని పరిస్థితి ఏర్పడింది.
Similar News
News November 27, 2024
కర్మవీర చక్ర అవార్డు అందుకున్న శ్రీకాకుళం వాసి
సంతబొమ్మాలి మండలం రుంకు హనుమంతుపురం గ్రామానికి చెందిన పోలాకి జయరామ్ కర్మవీర చక్ర అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో లక్షాలది మంది విద్యార్థుల జీవితాల్లో జీవన ప్రమాణాలు అభివృద్ధి కోసం కృషి చేశారు. ఇందుకోసం కర్మవీర చక్ర అవార్డును ఢిల్లీలో నవంబర్ 26న హార్ట్ ఫర్ ఇండియా ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ ప్రిన్సెస్ ప్రాన్క్రోసి స్టూడిజా చేతులు మీదుగా ప్రధానం చేశారు.
News November 27, 2024
ఎచ్చెర్ల: పీజీ కోర్సులో ఈనెల 29న స్పాట్ అడ్మిషన్
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మిగులు సీట్లకు ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ పి.సుజాత బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు ఉదయం.10 నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఈ ప్రవేశాలు జరగనున్నాయని తెలిపారు. ఏపీ పీజీ సెట్ -2024 అర్హతతో సంబంధం లేకుండా డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
News November 27, 2024
శ్రీకాకుళం: బాల్య వివాహాల నిర్మూలనకు అందరి సహకారం అవసరం
బాల్య వివాహాలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి తెలిపారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆమె వర్చువల్ విధానంలో నిర్వహించిన ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎన్ఐసి నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణా దేవి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాల్య వివాహ ముక్త్ భారత్ లక్ష్యం అన్నారు.