News August 11, 2024
శ్రీకాకుళం టీంను ఓడించిన నెల్లూరు జట్టు
నెల్లూరులో నేడు జరిగిన 11వ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో నెల్లూరు జట్టు విజేతగా నిలిచింది. శ్రీకాకుళం టీంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో నెల్లూరు ఆటగాళ్లు రాణించారు. సెమీ ఫైనల్లో విజయనగరం టీంను ఢీకొట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News September 17, 2024
నెల్లూరు: రైతులకు GOOD NEWS.. గడువు పెంపు
నెల్లూరు జిల్లాలోని పంటల నమోదులో చేయాల్సిన ఈక్రాప్ బుకింగ్ ఈకేవైసీ గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీతో ముగిసిందని జిల్లాలో చాలాచోట్ల నమోదులో కాలేదని దీంతో గడువు పెంచినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పంటలు వేసిన రైతులు ఈ క్రాప్ బుకింగ్ తో పాటు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని కోరారు.
News September 17, 2024
పొట్టకూటి కోసం కువైట్ వెళ్లి నెల్లూరు వాసి సూసైడ్
అనంతసాగరం(M), కమ్మవారిపల్లికి చెందిన ఆర్ వెంకటేశ్వర్లు(46) కువైట్‌లో సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు నాలుగేళ్లుగా కువైట్‌లో ఓ సేట్ వద్ద పనిచేస్తున్నాడు. అయతే ఆ సేట్ కొన్నినెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఆ ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. సోమవారం అతని మృతదేహాన్ని కమ్మవారిపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు.
News September 16, 2024
మంత్రి నారాయణతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించారని కోటంరెడ్డి తెలిపారు.