News June 4, 2024

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ ఆధిక్యం

image

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 13 రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 4,56,076 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు 2,60,369 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 1,95,707 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.

Similar News

News November 6, 2024

దంతలో అల్లుడిపై అత్తమామలు, భార్య దాడి

image

కోటబొమ్మాళి మండలం కురుడు గ్రామానికి చెందిన జలుమూరు దశమయ్య పై దంత గ్రామానికి చెందిన అతడి భార్య పావని, మామ బొమ్మాళి లచ్చుమయ్య, అత్త అదిలక్ష్మిలు దాడి చేశారు. కన్నవారి ఇంట్లో ఉన్న భార్య పావని ఆధార్ కార్డు అడగడంతో భార్యతోపాటు అత్తమామలు దశమయ్యపై దాడిచేసి గాయపరిచారు. ఈ మేరకు దశమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి. సత్యన్నారాయణ తెలిపారు.

News November 6, 2024

సోంపేట: అత్తకు తలకొరివి పెట్టిన కోడలు

image

సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన యజ్జల గోపమ్మ తన కోడలు తులసమ్మతో కలిసి ఉంటున్నారు. అనారోగ్యంతో గోపమ్మ మంగళవారం మృతిచెందారు. గోపమ్మకు కుమారుడు ప్రసాద్, కుమార్తె బెంగళూరులో కూలీ పనులకు వలస వెళ్లారు. అంత్యక్రియలు చేయడానికి ప్రసాద్ అందుబాటులో లేరు. దీంతో కోడలు తులసమ్మే అత్తకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు.

News November 6, 2024

శ్రీకాకుళం: IIIT విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం (త్రిబుల్ ఐటీ) విద్యార్థిని  ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విష ద్రావణం తాగిన విద్యార్థిని గుర్తించిన వసతి గృహం సిబ్బంది అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ మొదటి ఏడాది చదువుతున్న ఆమెది సొంత ప్రాంతం నంద్యాల.