News June 4, 2024
శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధిక్యం

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 15 రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 5,22,204 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు 2,99,715 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 2,22,489 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు. అలాగే జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తుంది.
Similar News
News February 28, 2026
శ్రీకాకుళం: ఆ మారణహోమం జరిగి నేటికి 15 ఏళ్లు పూర్తి

సంతబొమ్మాళి(M) కాకరపల్లి థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాటయోధులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఈస్ట్ కోస్ట్ సంస్థ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ 2011 ఫిబ్రవరి 28వ తేదీన స్థానికులు ఆందోళన చేపట్టారు. వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పర్యావరణ శాఖ ఈ ప్లాంట్ నిర్మాణాన్ని రద్దు చేసింది.
News February 28, 2026
శ్రీకాకుళం: ‘ఏపీ గురుకులాల్లో ప్రవేశాలు’

ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని DEO రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అడ్మిషన్ నోటిఫికేషన్ పోస్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో యూనిట్‌గా 5, 6, 7, 8వ తరగతులు, ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 18 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం కాగా, మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 28, 2026
అతిసారం అదుపులోనే ఉంది: శ్రీకాకుళం కలెక్టర్

అతిసారం పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 162 కేసులు నమోదు కాగా 47మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 112 మంది చికిత్స పొందుతున్నారు.


