News November 14, 2024

శ్రీకాకుళం: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నాలుగు రోజులే గడువు

image

శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు మరో నాలుగు రోజుల్లో చెల్లించాలి. ఈ సందర్భంగా తొలుత ప్రభుత్వం అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ లోపు చెల్లించాలని ప్రకటించగా దాన్ని ఈ నెల 18వ తేదీ వరకు గడువు పొడిగించింది. దీనితో 10వ తరగతి విద్యార్థులు 18వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజును ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Similar News

News December 8, 2024

శ్రీకాకుళం: కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన లారీ.. డ్రైవర్ మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యిరాళ్లకూడలి వద్ద చెన్నై-కలకత్తా హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి కొబ్బరికాయల లోడుతో వస్తున్న లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని దిండుగల్ చెందిన లారీ డ్రైవర్ షేక్ షబ్బీర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

News December 8, 2024

పాలకొండ: చెక్కుబౌన్స్ కేసులో ముద్దాయికి జైలు శిక్ష

image

విక్రమపురం గ్రామానికి చెందిన ఖండాపు విష్ణుమూర్తికి బాకీ తీర్చే నిమిత్తం పాలకొండ గ్రామానికి చెందిన కింతల సంతోష్ రూ.9.80.లక్షల చెక్కును అందజేశారు. ఆ చెక్కు బౌన్స్‌తో విష్ణుమూర్తి పాలకొండ కోర్టులో కేసు వేశారు. కోర్టు విచారణలో ముద్దాయి నేరం ఋజువు కావడంతో స్థానిక జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సదరు ముద్దాయి సంతోష్‌కు ఒక్క సంవత్సరం జైలు శిక్షను, చెక్కు మొత్తాన్ని నష్టపరిహారంగా ఇవ్వాలని తీర్పు చెప్పారు.

News December 7, 2024

శ్రీకాకుళం: పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలి 

image

చదువుకుంటున్న పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ప్రతి రోజు కనిపెడుతూ ఉండాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గుజరాతీ పేటలో స్థానిక అందవరపు వరహా నరసింహం (వరం )హైస్కూల్ నందు శనివారం ఉదయం జరిగిన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదకద్రవ్యాలు వద్దు బ్రో అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.