News April 10, 2024

శ్రీకాకుళం: ట్రాఫిక్ సిబ్బందికి కిట్స్ అందజేత

image

వేసవి తాపాన్ని తట్టుకునేందుకు క్యాప్స్, కళ్ళద్దాలు, వాటర్ బాటిల్స్‌లను ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జీ.ఆర్ రాధిక చేతుల మీదగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వేసవి కాలంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడే వస్తు సామగ్రి ఓ ప్రైవేటు సంస్థ ముందుకు రావడం చాలా అభినందనీయమన్నారు.

Similar News

News March 26, 2025

శ్రీకాకుళం: ‘కెమికల్ ఇంజనీర్లకు విపరీతమైన గిరాకీ’

image

శ్రీకాకుళం జిల్లాలో కెమిక‌ల్ ఇంజినీర్ల‌కు విప‌రీత‌మైన డిమాండు ఉంద‌ని శ్రీకాకుళం జిల్లా క‌లెక్ట‌రు స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్కర్ తెలిపారు. ఫార్మా రంగంలో జిల్లా వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పారు. అమరావతిలో బుధవారం సీఎం సమక్షంలో జరిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న త‌న జిల్లా ప్ర‌గ‌తి గురించి ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. జిల్లాలో ఫార్మా సంస్థ‌ల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్నారు.

News March 26, 2025

శ్రీకాకుళం: ఈ మండలాల ప్రజలకు అలెర్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఆమదాలవలస-38.1 ఉష్ణోగ్రత, బూర్జ-39, హిరమండలం-39.2, ఇచ్ఛాపురం-37.5, జలుమూరు-38-2, కంచిలి-37.4, కోటబొమ్మాళి-37.5, కొత్తూరు-39.7, ఎల్‌ఎన్ పేట-39 నరసన్నపేట-37.4, పాతపట్నం-38.9, పొందూరు-37.7, సారవకోట-38.4, సరుబుజ్జిలి-38.5, టెక్కలి-37.6 మండలాలకు అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంది.

News March 26, 2025

సీఎం రివ్యూ మీటింగ్‌లో శ్రీకాకుళం కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన అంశాలపై నివేదికలు సమర్పించారు. అలాగే జిల్లాకు అవసరమైన అభివృద్ధి పథకాల గురించి వివరించారు.

error: Content is protected !!