News June 15, 2024

శ్రీకాకుళం: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ(AU) పరిధిలో ఏప్రిల్- 2024లో జరిగిన బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(B.F.A) 8వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
డిగ్రీ విద్యార్థులు పరీక్షల ఫలితాలు చెక్ చేసుకోవాలని ఆంధ్రా యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చూడాలని AU పరీక్షల విభాగం తెలిపింది.

Similar News

News September 17, 2024

SKLM: హెల్మెట్ లేకుంటే రూ.1035 ఫైన్

image

బైకు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని.. లేకుంటే ఫైన్ వేస్తామని శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ నాగరాజు హెచ్చరించారు. నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని సూచించారు. హెల్మెట్ లేకుంటే రోడ్లపైకి వస్తే రూ.1035 ఫైన్ వేస్తామని హెచ్చరించారు.

News September 17, 2024

పలాస: దుస్తులు చించి ఆశా వర్కర్‌పై దాడి?

image

పలాస(M) లక్ష్మీపురం(P) కిష్టుపురంలో ఆశా వర్కర్‌ బూర్లె కృష్ణవేణిపై సోమవారం రాత్రి దాడి జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లలితమ్మ జ్వరానికి, బీపీకి మాత్రలు కావాలని కోరారు. జ్వరానికి మాత్రలు ఇచ్చి.. బీపీకి డాక్టర్లే చెక్ చేసి ఇస్తారన్నారు. దీంతో లలితమ్మ భర్త కృష్ణారావు, ఆమె కుమారుడు మోహన్ కృష్ణవేణిపై దాడి చేశారు. తన నైటీని కూడా చించేశారంటూ సీఐ మోహనరావుకు ఆమె ఫిర్యాదు చేశారు.

News September 17, 2024

శ్రీకాకుళం: అగ్ని ప్రమాదంపై అనుమానం.. డీసీసీ అధ్యక్షుడు అంబటి

image

పార్టీ ఆస్తులకు ఎవరైనా నష్టం కలిగిస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి కృష్ణారావు అన్నారు. నగరంలోని ఇందిరా విజ్ఞానభవన్‌లో విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈనెల7 తేదీన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం విషయం ఎవరికీ చెప్పవద్దని పార్టీ నేతలుగా తాము మాట్లాడుకుంటే అదే విషయం పత్రికల్లో కథనాలు రావడాన్ని బట్టి కుట్రకోణం దాగిఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు.