News June 7, 2024

శ్రీకాకుళం: డిగ్రీ ఫలితాలు విడుదల

image

డా.బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఐదో సెమిస్టర్ ఫలితాలను డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల్లో 10,822 మంది విద్యార్థులకు 5,316 మంది ఉత్తీర్ణత (49.12శాతం) సాధించారని తెలిపారు. పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్ సైట్‌లో పొందుపరిచామని, పునఃమూల్యాంకనం కొరకు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News October 19, 2025

జీఎస్టీ 2.0తో మంచి సంస్కరణలు: కేంద్రమంత్రి

image

జీఎస్టీ 2.0 తో మంచి సంస్కరణలు అమలు అయ్యాయని కేంద్ర పౌరవిమానయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం NTR మున్సిపల్ గ్రౌండ్స్‌లో సిక్కోలు ఉత్సవ్ పేరుతో జరుగుతున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన శనివారం హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో GST2.0ను పీఎం మోదీ అమలు చేశారన్నారు.

News October 19, 2025

శ్రీకాకుళం: తహశీల్దార్‌ను తొలగించాలని ఆందోళన

image

ఓ బీసీ మహిళను కొత్తూరు తహశీల్దార్ కె.బాలకృష్ణ మానసికంగా వేధిస్తున్నారని.. ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు కూటికుప్పల నరేశ్ కుమార్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీ సంఘాల నాయకులు శనివారం ఆందోళన చేశారు. ఇంటి స్థలం పొజిషన్ సర్టిఫికెట్ కోసం రూ.30వేలు లంచం ఇవ్వాలని, లేకపోతే తనతో ఒక రోజు గడపాలని తహశీల్దార్ కోరడం దురదృష్టకరమన్నారు.

News October 19, 2025

అనుమతి లేని బాణసంచా విక్రయాలపై కఠిన చర్యలు: ఎస్పీ

image

ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా బాణసంచా సామాగ్రిని విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఆనందంగా దీపావళి జరుపుకోవాలని సూచించారు. లైసెన్స్ ఉన్న షాపుల యజమానులు మాత్రమే అమ్మకాలు జరపాలని, కాలుష్య రహిత క్రాకర్స్‌ను వినియోగిస్తే మంచిదని ఆయన తెలిపారు.