News July 16, 2024

శ్రీకాకుళం: డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

BR అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకై(ఇయర్ ఎండ్) స్పెషల్ డ్రైవ్ పరీక్షల నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. 2011-15 మధ్య అడ్మిషన్ తీసుకున్న డిగ్రీ విద్యార్థులు రాయాల్సిన ప్రాక్టికల్, థియరీ పరీక్షలకై విద్యార్థులు ఆగస్టు 14లోపు ఫీజు చెల్లించాలని వర్శిటీ సూచించింది. ఆగస్టు 22 నుంచి ప్రాక్టికల్స్, సెప్టెంబరు 3 నుంచి థియరీ పరీక్షలు జరుగుతాయని, వివరాలకు వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.

Similar News

News December 13, 2025

15న టెక్కలిలో ప్రజా వేదిక: కలెక్టర్

image

ఈనెల 15న టెక్కలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని నూతన సమావేశ మందిరంలో నిర్వహిస్తారని చెప్పారు. ఈ వేదికలో ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 13, 2025

శ్రీకాకుళం: ‘లక్ష్యానికి దూరంగా ధాన్యం సేకరణ’

image

జిల్లాలో 30 మండలాల్లో ధాన్యం కొనుగోలు కోసం 406 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 6,50,000 మెట్రిక్ టన్నులు సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. సంక్రాంతి లోపు వరి ధాన్యం నూర్పులు పూర్తి చేసి అమ్మటం రైతుల ఆనవాయితీ. ప్రస్తుతం పొలాల్లో వరి కుప్పలు దర్శనమిస్తున్నాయి. ధాన్యం అమ్మకం దళారులపై ఆధారపడే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల అమలు కావటం లేదని రైతులు అంటున్నారు.

News December 13, 2025

సంతబొమ్మాళి: రాకాసి అలలు..ప్రాణాలు తీశాయి

image

చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి(M) భావనపాడులో శనివారం ఉదయం జరిగింది. తోటి జాలర్లతో వేటకెళ్లిన రాజయ్య(60) బలమైన కెరటాలకు తెప్ప నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అప్రమత్తమై కాపాడేలోపే రాకాసి అలల తాకిడికి తనువు చాలించాడు. అనంతరం డెడ్ బాడీని ఒడ్డుకు తీసుకురాగా..సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.