News October 9, 2024
శ్రీకాకుళం: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 20వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని. ప్రాక్టికల్స్ ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.
Similar News
News November 2, 2024
SKLM: జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం జిల్లా అభివృద్ధిపై చర్చలు జరిపారు. జిల్లాకు కావాల్సిన నిధులు, పెండింగ్ పనులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు జిల్లా అభివృద్ధికి పలు సూచనలు చేశారు. సీఎంతో పాటుగా మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు.
News November 1, 2024
టెక్కలి లేదా పలాస ఎయిర్ పోర్టు నిర్మాణం: సీఎం చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు సమీపంలో సుమారు 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఈదుపురం సభలో ఆయన మాట్లాడుతూ.. టెక్కలి లేదా పలాస ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. చంద్రబాబు ప్రకటనతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News November 1, 2024
ఇచ్ఛాపురం: సీఎం సభలో జిల్లా కూటమి నేతల సందడి
ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలోని ఈదుపురం గ్రామంలో శుక్రవారం జరిగిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కూటమి నేతలు సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌తో పాటు ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, ఎన్.ఈశ్వరరావు, జనసేన, బీజేపీ నాయకులు సీఎం సభకు హాజరయ్యారు.